పవన్ కల్యాణ్‌తో చేసే సినిమా ఆగిపోలేదు: క్రిష్

ABN , First Publish Date - 2020-08-19T05:06:05+05:30 IST

మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల గురించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాగా వినిపిస్తోంది. ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అంటూ దాదాపు ఐదారు సినిమాలు

పవన్ కల్యాణ్‌తో చేసే సినిమా ఆగిపోలేదు: క్రిష్

మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల గురించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాగా వినిపిస్తోంది. ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అంటూ దాదాపు ఐదారు సినిమాలు పవన్ చేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. షూటింగ్ పరంగా మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రొగ్రెస్ లేదు. కరోనా కారణంగా ఆగిపోయిన ‘వకీల్‌సాబ్’ పూర్తి అయితేనే కానీ.. పవన్ మరో సినిమాని లైన్‌లో పెట్టడు. దీంతో ‘వకీల్‌సాబ్’ తర్వాత చేయాలనుకున్న క్రిష్ చిత్రంపై ఇప్పుడు కొన్ని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. పవన్, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన చిత్రం ఆగిపోయిందంటూ కొందరు సోషల్ మీడియాలో వార్తలు పుట్టించారు. 


అయితే అలాంటిదేమీ లేదని డైరెక్టర్ క్రిష్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మొదలవుతుందని, సినిమా ఆగిపోలేదని క్రిష్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ మొదలయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించడం లేదు. ఇక పవన్ రంగంలోకి దిగితే.. లొకేషన్‌లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిమానులను కంట్రోల్ చేయలేరు. అందుకే పవన్ కూడా ఇప్పట్లో షూటింగ్స్ వద్దని తన దర్శకనిర్మాతలు చెప్పేసినట్లుగా వార్తలు వచ్చాయి. సో.. ఎలా చూసినా పవన్, క్రిష్ కాంబో చిత్ర షూటింగ్ ఈ సంవత్సరంలో జరిగే అవకాశాలు అయితే లేవు. వచ్చే సంవత్సరమే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 

Updated Date - 2020-08-19T05:06:05+05:30 IST