పవన్ అనుమతితోనే ఆ సినిమా చేశా: క్రిష్

ABN , First Publish Date - 2020-12-26T17:08:00+05:30 IST

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్ హీరో హీరోయిన్లుగా అతి తక్కువ సమయంలో డైరెక్టర్ క్రిష్ ఓ సినిమాను పూర్తి చేశారు.

పవన్ అనుమతితోనే ఆ సినిమా చేశా: క్రిష్

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్ హీరో హీరోయిన్లుగా అతి తక్కువ సమయంలో డైరెక్టర్ క్రిష్ ఓ సినిమాను పూర్తి చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కేవలం 45 రోజుల్లోనే ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో రకుల్ డీ-గ్లామర్ పాత్రలో నటిస్తోంది. తాజాగా `సామ్ జామ్` కార్యక్రమానికి హాజరైన క్రిష్ ఆ సినిమా గురించిన వివరాలు వెల్లడించారు. 


`లాక్‌డౌన్ టైమ్‌లో చదివిన `కొండపొలం` అనే పుస్తకం నన్ను బాగా కదిలించింది. వెంటనే సినిమాగా తీసేయాలనిపించింది. వెంటనే ఆ నవల హక్కులు తీసుకోమని నా పార్ట్‌నర్‌కు చెప్పాను. రెండు మూడేళ్ల తర్వాత ఈ సినిమా చేయాలనుకున్నాను. అయితే తన సినిమా కంటే ముందు మరో సినిమా చేసుకొమ్మని పవన్ సూచించారు. దీంతో వెంటనే ఈ సినిమాను మొదలుపెట్టాను. ఈ సినిమాలో రకుల్ రాయలసీమ అమ్మాయి ఓబులమ్మగా కనిపించబోతోంద`ని క్రిష్ తెలిపారు. 

Updated Date - 2020-12-26T17:08:00+05:30 IST