‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’పై హరీష్ తాజా ట్వీట్స్ వైరల్

ABN , First Publish Date - 2020-08-04T23:05:48+05:30 IST

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబ‌లి’. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’పై హరీష్ తాజా ట్వీట్స్ వైరల్

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబ‌లి’. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు అందించిన మ‌రో కంటెంట్ బేస్డ్ మూవీ ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా ‘కేరాఫ్ కంచ‌పాలెం’ ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య‌దేవ్ హీరోగా న‌టించారు. ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. అలాగే ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా పొందుతోంది. తాజాగా ఈ చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ వరుస ట్వీట్స్ చేశారు.


“కళ అనేది పాఠాలు వింటే రాదు, పరితపిస్తే వస్తుంది."

“వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళను వెళ్ళనివ్వక పోతే వాళ్ళు ఉన్నా ఆ వెలితి ఉండిపోతుంది". ఇటీవలి కాలంలో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా ఈ చిత్రం నిలబడుతుంది. నిర్మాత శోభు యార్లగడ్డ, నటుడు సుహాస్‌లకు అభినందనలు. ఇక హీరో సత్యదేవ్ నటన గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక దర్శకుడు వెంకటేష్ మహ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి అతను అర్హుడు. ఒక సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. మీ మీద చాలా గౌరవం పెరిగింది. సాధ్యమైనంత వరకు మీరు మీ దారిలోనే వెళ్లేందుకు ప్రయత్నించండి. ఇక నిజమైన నిర్మాత చిత్ర పరిమాణం చూసుకుని సినిమా చేయడు. ఫ్యాషన్, అభిరుచి వంటివే వారికి ప్రధానమెట్లు. శోభుగారు అలాంటి నిర్మాతలలో ఒకరు.. అని హరీష్ శంకర్ వరుస ట్వీట్స్‌తో ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.



Updated Date - 2020-08-04T23:05:48+05:30 IST