రామ్ ‘రెడ్’.. మాస్ బీట్ దుమ్మురేపుతోంది
ABN , First Publish Date - 2020-12-30T23:58:48+05:30 IST
ఎనర్జిటిక్ స్టార్ రామ్, నివేదా పేతురాజ్ , మాళవికాశర్మ, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘రెడ్’ చిత్రం జనవరి 14 న సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు

ఎనర్జిటిక్ స్టార్ రామ్, నివేదా పేతురాజ్ , మాళవికాశర్మ, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘రెడ్’ చిత్రం జనవరి 14 న సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. తిరుమల కిశోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రామ్ చేసిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్రంలో హీరో రామ్, హెబ్బా పటేల్ పై చిత్రీకరించిన స్పెషల్ మాస్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్రయూనిట్ బుధవారం విడుదల చేసింది.
ఈ పాట విడుదల సందర్బంగా చిత్ర నిర్మాత ‘స్రవంతి’రవి కిషోర్ మాట్లాడుతూ.. “సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ ఇది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ గా సెట్ వేసి 6 రోజులు భారీ నిర్మాణ వ్యయంతో ఈ పాట చిత్రీకరించాం. 'ఏయ్ డించక్ డించక్ డింక .. ఆడ ఈడ దూకకే జింక... డించక్ డించక్ డింక.. మా బీచ్‌కి రావే ఇంక' అంటూ కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సాకేత్, కీర్తనా శర్మ ఆలపించారు. జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు. దీంతో పాటు ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి. మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనవరి 14న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం..” అని తెలిపారు.
నృత్య దర్శకుడు జానీ మాస్టర్ మాట్లాడుతూ.. “మార్చి నెలలో లాక్‌డౌన్‌కు ముందు చేసిన పాట ఇది. చాలా ఎనర్జిటిక్ సాంగ్ ఇది. ఈ పాట విషయంలో హీరో రామ్‌కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ పాట బాగా రావడానికి ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా ఉపకరించాయి. పాట అద్భుతంగా వచ్చింది. రామ్ తన స్టెప్స్ తో ఇరగ దీసేశారు. హెబ్బా పటేల్ కి ఇదే ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేయడం. తను కూడా చాలా బాగా చేసింది. ఈ పాట బాగా రావడానికి బడ్జెట్ పరంగా రవి కిషోర్ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మణిశర్మగారు ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బీజియమ్స్ అదిరిపోయాయి. థియేటర్‌లలో ఈ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది.” అని చెప్పారు.
