తాతలాగే మనవడున్నాడంటున్న బాలీవుడ్‌ స్టార్‌

ABN , First Publish Date - 2020-09-16T17:06:12+05:30 IST

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ డింపుల్‌కు అల్లుడే. అక్షయ్‌ తనయుడు ఆరవ్‌ కూడా తాత రాజేశ్ ఖన్నాలాగా బిహేవ్‌ చేస్తుంటారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డింపుల్‌ కపాడియా.

తాతలాగే మనవడున్నాడంటున్న బాలీవుడ్‌ స్టార్‌

బాలీవుడ్‌ తొలి సూపర్‌స్టార్‌ రాజేశ్‌ఖన్నా. వరుసగా 15 సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించిన ఘనత ఈయన సొంతం. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ క్రాస్‌ చేయలేదు. ఈయన అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో ఈయన భారీ రేంజ్‌లో లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. అప్పట్లో రాజేశ్‌ ఖన్నా పెళ్లి డింపుల్‌ కపాడియాతో జరిగిందని తెలిసి ఎంతో మంది లేడీ ఫ్యాన్స్‌ హృదయాలు గాయపడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ డింపుల్‌కు అల్లుడే. అక్షయ్‌ తనయుడు ఆరవ్‌ కూడా తాత రాజేశ్ ఖన్నాలాగా బిహేవ్‌ చేస్తుంటారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డింపుల్‌ కపాడియా. "తాతగారిలాగే ఆరవ్‌ తక్కువగా మాట్లాడుతాడు. నేనెప్పుడైనా బయటకు వెళ్లడానికి డ్రెస్‌ చేసుకున్నప్పుడు ఆరవ్‌ గమనిస్తాడు. నా దగ్గరకు వచ్చి అమ్మమ్మ మీరెంతో బావున్నారని కితాబిస్తాడు". రాజేష్‌ ఖన్నాగారు కూడా ఇలాగే ప్రవర్తించేవారు అన్నారు డింపుల్‌ కపాడియా. 


Updated Date - 2020-09-16T17:06:12+05:30 IST