‘మైల్స్ ఆఫ్ లవ్’లోని యశస్వి పాడిన పాట విడుదల

ABN , First Publish Date - 2020-12-30T23:23:25+05:30 IST

'హుషారు' చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోగా నటించిన అభినవ్ మేడిశెట్టి హీరోగా కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నందన్ దర్శకత్వంలో రాజిరెడ్డి నిర్మించిన చిత్రం 'మైల్స్ ఆఫ్ లవ్'. రామ్ కామ్

‘మైల్స్ ఆఫ్ లవ్’లోని యశస్వి పాడిన పాట విడుదల

'హుషారు' చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోగా నటించిన అభినవ్ మేడిశెట్టి హీరోగా కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నందన్ దర్శకత్వంలో రాజిరెడ్డి నిర్మించిన చిత్రం 'మైల్స్ ఆఫ్ లవ్'. రామ్ కామ్  బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్య పసుపులేటి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలోని 'గగనము దాటే' వీడియో సాంగ్‌ని డిసెంబర్ 30న హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. స్మాల్‌ స్క్రీన్‌పై 'లైఫ్‌ ఆఫ్‌ రామ్‌' పాటతో ఫేమస్‌ సింగర్‌గా మారిన యశస్వి కొండేపూడి ఈ పాటను ఆలపించారు. ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట మార్కెట్లో విడుదలైంది.


పాట విడుదల అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ''హుషారులో యాక్ట్ చేసిన అభినవ్, రమ్య కాంబినేషన్‌లో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో మా రాజిరెడ్డి నిర్మిస్తున్న మైల్స్ ఆఫ్ లవ్ చిత్రంలో ఫస్ట్ సాంగ్ 'గగనము దాటే' సాంగ్ లాంచ్ చేశాను. యశస్వి ఫెంటాస్టిక్‌గా పాడాడు.. విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. డైరెక్టర్ నందన్ సాంగ్ పిక్చరైజేషన్ బాగా చిత్రీకరించారు. ఈ సినిమా సక్సెస్ అయి మా రాజిరెడ్డి.. ఇంకా మరిన్ని మంచి చిత్రాలు తీయాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.." అన్నారు.


దర్శకనిర్మాతలు మాట్లాడుతూ... ప్రెజెంట్ యూత్‌కి నచ్చే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రామ్ కామ్ బ్యాక్‌డ్రాప్‌లో 'మైల్స్ ఆఫ్‌ లవ్' చిత్రాన్ని రూపొందించాం. అభినవ్, రమ్య పెయిర్ చాలా బాగా కుదిరింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కోపరేట్ చేసి సినిమా బాగా రావడానికి హెల్ప్ చేశారు. ఆల్ రెడీ డైరెక్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోకి రెండు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.. ధ్రువన్ ఎక్సలెంట్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ దిల్ రాజు గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దిల్ రాజుగారు, బెక్కం వేణుగోపాల్‌గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. రవి మణి కె.నాయుడు అందించిన విజువల్స్ కనుల పండగగా ఉంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం..'' అని తెలిపారు.Updated Date - 2020-12-30T23:23:25+05:30 IST