కొత్త జీవితంలోకి ‘దిల్‌’రాజు

ABN , First Publish Date - 2020-05-11T08:02:57+05:30 IST

నిర్మాత ‘దిల్‌’ రాజు సరికొత్త జీవితం ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఆయన ఏడడుగులు వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘‘ప్రపంచమంతా స్తంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో...

కొత్త జీవితంలోకి ‘దిల్‌’రాజు

నిర్మాత ‘దిల్‌’ రాజు సరికొత్త జీవితం ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఆయన ఏడడుగులు వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘‘ప్రపంచమంతా స్తంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో... మనలో చాలామందికి వృత్తిపరంగా ఏమంత గొప్పగా లేదు. కొన్నాళ్లుగా నా వ్యక్తిగత జీవితంలోనూ గొప్ప సంఘటనలు, సంతోషాలు లేవు. కానీ... త్వరలో పరిస్థితులు చక్కబడతాయనీ, మనమంతా బావుంటామనీ ఆశిస్తున్నా. అటువంటి ఆశతో  సంతోషంగా నా వ్యక్తిగత జీవితాన్ని పునఃప్రారంభించడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నాను’’ అని ఆదివారం ఉదయం ‘దిల్‌’ రాజు తెలిపారు. తన వివాహం గురించే ఆయన ఈ ప్రకటన చేశారని వినికిడి. బంధువుల అమ్మాయినే ఆయన చేసుకున్నారట. నిజామాబాద్‌లోని సొంత వ్యవసాయ క్షేత్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగిందని తెలిసింది. ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్దిమంది మాత్రమే, ఇరవై మందిలోపే ఈ పెళ్లికి హాజరయ్యారని సమాచారం. పూర్తి వివరాలు సోమవారం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2020-05-11T08:02:57+05:30 IST