దిల్ రాజు.. 5 సినిమాలు!

ABN , First Publish Date - 2020-12-24T16:42:01+05:30 IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు జోరు పెంచారు.

దిల్ రాజు.. 5 సినిమాలు!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు జోరు పెంచారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ ఏడాది సైలెంట్ అయిన దిల్ రాజు వచ్చే ఏడాది వరుస సినిమాలతో సిద్ధమవుతున్నారు. 2021లో ఏకంగా 5 సినిమాలను విడుదల చేయబోతున్నారు. 


ఆ ఐదు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉండడం గమనార్హం. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `వకీల్ సాబ్`, `ఎఫ్2` సీక్వెల్ `ఎఫ్3`, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా `థాంక్యూ`, విష్వక్సేన్ హీరోగా `పాగల్`తోపాటు `హుషారు` సినిమా డైరెక్టర్ తర్వాతి సినిమా కూడా దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్నాయి. ఈ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 

Updated Date - 2020-12-24T16:42:01+05:30 IST