విభిన్న పాత్రలకు ‘నాంది’

ABN , First Publish Date - 2020-06-28T06:57:31+05:30 IST

హీరోగా ‘సిల్లీఫెలోస్‌’ చిత్రం తర్వాత కొంతగ్యాప్‌ తీసుకున్న అల్లరి నరేశ్‌ ‘నాంది’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్...

విభిన్న పాత్రలకు ‘నాంది’

హీరోగా ‘సిల్లీఫెలోస్‌’ చిత్రం తర్వాత కొంతగ్యాప్‌ తీసుకున్న అల్లరి నరేశ్‌ ‘నాంది’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు 80శాతం చిత్రీకరణ పూర్తయింది. శనివారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆందోళన నిండిన ముఖంతో జైలులో నగ్నంగా కూర్చొని ఉన్న అల్లరి నరేశ్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ నెల 30న అల్లరి నరేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘నాంది ఎఫ్‌ఐఆర్‌’ (ఫస్ట్‌ ఇంపాక్ట్‌ రివీల్‌)ను విడుదల చేయనున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, నవమి, హరీశ్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి, దేవీప్రసాద్‌, వినయ్‌ వర్మ, సి.ఎల్‌. నరసింహారావు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సినిమాటోగ్రఫీ: సిద్‌. 


Updated Date - 2020-06-28T06:57:31+05:30 IST