12 ఏళ్లలో తెలుసుకోలేకపోయా

ABN , First Publish Date - 2020-07-12T05:18:10+05:30 IST

అనుష్కాశర్మ కెరీర్‌ ప్రారంభించి పుష్కరకాలం దాటింది. నటిగా, నిర్మాతగా ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఆమెకు ఇప్పటికీ అర్థం కాని ఓ విషయం ఉందట. ఒక హీరో, హీరోయిన్‌ ఒకే రోజు ఇండస్ట్రీలో అడుగుపెట్టినా...

12 ఏళ్లలో తెలుసుకోలేకపోయా

అనుష్కాశర్మ కెరీర్‌ ప్రారంభించి పుష్కరకాలం దాటింది. నటిగా, నిర్మాతగా ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఆమెకు ఇప్పటికీ అర్థం కాని ఓ విషయం ఉందట. ఒక హీరో, హీరోయిన్‌ ఒకే రోజు ఇండస్ట్రీలో అడుగుపెట్టినా, వారిద్దరూ ఎవరికీ పరిచయం లేకపోయినా పారితోషికం విషయంలో వివక్ష చూపిస్తారు. అమ్మాయికి తక్కువ, అబ్బాయికి ఎక్కువ ఇస్తారు. గట్టిగా మాట్లాడితే ‘నువ్వు కొత్తగా వచ్చావ్‌ నీ ఫేస్‌ ఎవరికి తెలుసు’ అని హీరోయిన్‌ను తక్కువ చేసి మాట్లాడతారు. కొత్తగా వచ్చిన అబ్బాయి విషయంలో కూడా అలాగే ఆలోచించాలి కదా! కొత్త అమ్మాయిల విషయంలో ఎందుకంత వివక్ష చూపిస్తారో ఈ 12 ఏళ్లలో తెలుసుకోలేకపోయా. సెట్‌లో ప్రతి ‘ఒక్కరూ మహిళల్ని గౌరవిస్తాం, స్ర్తీలకు సమానహక్కులున్నాయి’ అని అంటుంటారు. పారితోషికం తగ్గించి ఇవ్వడమేనా సమానత్వం అంటే... ఏమో? ఇప్పటికీ ఈ విషయాల మీద నాకు క్లారిటీ లేదు’’ అని అనుష్కాశర్మ అన్నారు.


Updated Date - 2020-07-12T05:18:10+05:30 IST