నువ్వు ఎప్పటికీ గుర్తుంటావు: జెనీలియాతో విష్ణు

ABN , First Publish Date - 2020-04-14T17:18:31+05:30 IST

మంచు విష్ణు, జెనిలియా హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన `ఢీ` సినిమా సంచలన విజయంగా నిలిచింది.

నువ్వు ఎప్పటికీ గుర్తుంటావు: జెనీలియాతో విష్ణు

మంచు విష్ణు, జెనీలియా హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన `ఢీ` సినిమా సంచలన విజయంగా నిలిచింది. 2007, ఏప్రిల్ 13న విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులందరినీ అలరించింది. ఈ సినిమా విడుదలై 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంచు విష్ణు, జెనీలియా, శ్రీనువైట్ల ట్విటర్ ద్వారా స్పందించారు. 


`2007, ఏప్రిల్ 13న నవ్వీ.. నవ్వీ.. కన్నీళ్లొచ్చాయి. ఈ సినిమా విడుదలవడానికి కారకుడైన మా నాన్నకు కృతజ్ఞతలు. చాలా గొప్ప సినిమా. మై బిగ్ బ్రదర్.. శ్రీనువైట్ల.. ఢీ2 ఎప్పుడు` అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన జెనీలియా.. `నేను అక్కడ ఉన్నట్టు నీకు గుర్తుందా` అని ప్రశ్నించింది. ఈ ట్వీట్‌కు మంచు విష్ణు.. `నువ్వు ఫొటో చూశావా? నువ్వు చాలా అందంగా ఎప్పటికీ గుర్తుంటావు` అని సమాధానమిచ్చాడు. ఇక, శ్రీనువైట్ల స్పందిస్తూ.. `నా కెరీర్‌లో `ఢీ` చాలా ప్రత్యేకమైన చిత్రం. చాలా కష్టమైన సన్నివేశాలను కూడా అందరి సహకారంతో సులభంగా తెరకెక్కించా. విష్ణు, శ్రీహరి, బ్రహ్మానందం, జెనీలియా, సునీల్‌కు ధన్యవాదాలు` అని ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-04-14T17:18:31+05:30 IST