ధనుష్‌ ‘తోకచుక్క’

ABN , First Publish Date - 2020-10-30T07:19:51+05:30 IST

‘అసురన్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రంతో అభిమానులను సంతోషరిచారు ధనుష్‌. ప్రస్తుతం ఆయన కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో...

ధనుష్‌ ‘తోకచుక్క’

‘అసురన్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రంతో అభిమానులను సంతోషరిచారు ధనుష్‌. ప్రస్తుతం ఆయన కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ‘జగమే తథ్థిరమ్‌’, మారీ సెల్వరాజ్‌ దర్శకత్వంలో ‘కర్ణన్‌’ చిత్రాలు చేస్తున్నారు. ఈ రెండింటితో పాటు ధనుష్‌ ఓ కొత్త చిత్రాన్ని అంగీకరించాడని కోలీవుడ్‌ టాక్‌. ‘రాచ్చసన్‌’ ఫేమ్‌ దర్శకుడు రామ్‌కుమార్‌ ధనుష్‌ కోసం రెండేళ్లు కష్టపడి ఓ స్ర్కిప్ట్‌ సిద్ధం చేశాడు. ఇప్పటిదాకా భారతీయ సినిమాల్లో ఎవరూ టచ్‌ చేయని ఓ కొత్త సబ్జెక్ట్‌ కావడంతో ఽసైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌కు దనుష్‌ ఓకే చెప్పారట. ఖగోళం నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో ‘వాల్‌ నచ్చత్రిమ్‌’ (తెలుగు అర్థం ‘తోకచుక్క’) అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారట. భారీ బడ్జెట్‌ చిత్రం కావడంతో షూటింగుకు ఎక్కువ సమయం పడుతుందని భావించిన ధనుష్‌ త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. వచ్చే ఏడాది మొదట్లోనే ఈ చిత్రం షూటింగు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.

Updated Date - 2020-10-30T07:19:51+05:30 IST