మైఖేల్‌జాక్సన్ బాణీలో ధనుష్ డాన్స్
ABN , First Publish Date - 2020-11-14T21:57:38+05:30 IST
కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘జగమే తందిరమ్’. ఈ సినిమాను తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల చేస్తున్నారు.

కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘జగమే తందిరమ్’. ఈ సినిమాను తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘రకిడ రకిడ’ అనే సాంగ్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిత్రంలోని ‘బుజ్జీ’ అనే రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటను పూర్తిగా విదేశాల్లో చిత్రీకరించారు. హీరో ధనుష్ ఈ పాటకు మైఖేల్‌జాక్సన్‌ను తలపించే మూమెంట్స్‌తో చేసిన నృత్యం ఆయన అభిమానులను అలరించింది. వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై శశికాంత్ నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్‌తోపాటు ఐశ్వర్యా లక్ష్మి, జేమ్స్, కాస్మో, కళైయరసన్, సంజనా నటరాజన్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు.