కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో ధనుష్‌

ABN , First Publish Date - 2020-02-04T20:55:16+05:30 IST

‘ధ్రువంగళ్‌ పదినారు’తో టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా ప్రశంసలందుకున్న కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించేందుకు అంగీకరించారు. ఇది ధనుష్‌ 43వ

కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో ధనుష్‌

‘ధ్రువంగళ్‌ పదినారు’తో టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా ప్రశంసలందుకున్న కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించేందుకు అంగీకరించారు. ఇది ధనుష్‌ 43వ చిత్రం. సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్‌పై టీజీ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. పొంగల్‌కి విడుదలైన ధనుష్‌ చిత్రం ‘పటాస్‌’ కూడా ఈ బ్యానర్‌లో నిర్మించిందే. ధనుష్‌కి జోడీగా నటించే హీరోయిన్‌ సహా ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ను పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ పూర్తి చేసి అక్టోబర్‌లో సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభంకానుంది. 

Updated Date - 2020-02-04T20:55:16+05:30 IST