ధనుశ్‌ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌..!

ABN , First Publish Date - 2020-12-18T18:27:07+05:30 IST

కోలీవుడ్ హీరో దనుశ్ 'ది గ్రే మ్యాన్‌' అనే హాలీవుడ్‌ మూవీలో ధనుశ్‌ ఓ కీలక పాత్రను పోషించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ధనుశ్‌ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌..!

తెలుగు, తమిళ ప్రేక్షకులకే కాదు.. బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన అతి కొద్ది మంది హీరోల్లో ధనుశ్‌ ఒకరు. మన ఇండియన్‌ సినిమాల్లోనే కాకుండా కొన్ని నెలల క్రితం 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌' అనే హాలీవుడ్‌ సినిమాలో ధనుశ్‌ నటించిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేసే ఈ స్టార్‌ త్వరలోనే మరోసారి హాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించనున్నారట. 'ది గ్రే మ్యాన్‌' అనే హాలీవుడ్‌ మూవీలో ధనుశ్‌ ఓ కీలక పాత్రను పోషించనున్నారు. ఈ సినిమాలో ధనుశ్‌ సరసన జెస్సీకా హెన్‌విక్‌ హీరోయిన్‌గా నటిస్తన్నారు. ఇంకా ఈ సినిమాలో రియాన్ గోలింగ్, క్రస్ ఎవాన్స్, అనాదే అర్మాస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అవెంజర్స్‌, కెప్టెన్‌ అమెరికా, వింటర్‌ సోల్జర్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు రూసో బ్రదర్స్‌ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రముఖ డిజిటిల్‌ సంస్థ నెట్‌ఫ్లిక్‌ నిర్మిస్తున్న చిత్రం డైరెక్ట్‌ డిజిటల్‌ రిలీజ్‌ కానుంది. Updated Date - 2020-12-18T18:27:07+05:30 IST