బన్నీకి దేవిశ్రీ గిఫ్ట్!

ABN , First Publish Date - 2020-04-06T17:53:53+05:30 IST

తన స్నేహితుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మూడ్రోజుల ముందే బర్త్ డే గిఫ్ట్ అందించాడు.

బన్నీకి దేవిశ్రీ గిఫ్ట్!

తన స్నేహితుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మూడ్రోజుల ముందే బర్త్ డే గిఫ్ట్ అందించాడు. ఈ నెల ఎనిమిదో తేదీన బన్నీ 37వ జన్మదినోత్సవం జరుపుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బన్నీ అభిమానుల కోసం దేవి శ్రీ ప్రసాద్ కామన్ డీపీ (సీడీపీ)ని విడుదల చేశాడు. ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించిన పాత్రల ఫోటోలను ఎడిట్ చేసి సీడీపీగా రిలీజ్ చేశాడు. 


`నా ప్రియ మిత్రుడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సీడీపీని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌‌డ్ హ్యాపీ బర్త్‌ డే బన్నీ బాయ్‌. బర్త్‌ డే రోజున మరోసారి విష్‌ చేస్తాను` అని దేవి ట్వీట్‌ చేశాడు. ఈ సీడీపీ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. బన్నీ అభిమానులందరూ దీని తమ డీపీగా పెట్టుకుంటున్నారు. ఇక, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్‌లుక్ కూడా బర్త్‌డే సందర్భంగా విడుదల కాబోతున్నట్టు సమాచారం.  

Updated Date - 2020-04-06T17:53:53+05:30 IST