అల్లు అర్జున్ పాత్రను చెక్కుతున్నాడట..

ABN , First Publish Date - 2020-04-28T04:13:23+05:30 IST

‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఇంత వరకు సుకుమార్ నుంచి మరో మూవీ రాలేదు. మధ్యలో మహేష్ బాబుతో మూవీ ప్రకటించిన తర్వాత, సడెన్‌గా అది ఆగిపోవడం.. వెంటనే

అల్లు అర్జున్ పాత్రను చెక్కుతున్నాడట..

‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఇంత వరకు సుకుమార్ నుంచి మరో మూవీ రాలేదు. మధ్యలో మహేష్ బాబుతో మూవీ ప్రకటించిన తర్వాత, సడెన్‌గా అది ఆగిపోవడం.. వెంటనే సుకుమార్.. అల్లు అర్జున్‌తో మూవీని అనౌన్స్ చేయడం జరిగిపోయాయి. అంతా అనుకుని బన్నీతో షూటింగ్ మొదలెట్టడానికి రెడీ అవుతున్న సమయంలో ‘కరోనా’ రూపంలో ఈ చిత్ర షూటింగ్‌కి పెద్ద బ్రేక్ పడింది. అయినా సరే అభిమానులను డిజప్పాయింట్ చేయకూడదని, బన్నీ పుట్టినరోజున ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను, చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ‘పుష్ప’ అనే టైటిల్‌తో పాటు విడుదల చేసిన అల్లు అర్జున్ ఊర మాస్ లుక్.. ఈ చిత్రంపై ఇప్పటి వరకు లేని క్రేజ్‌ని అమాంతం పెంచేశాయి. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. ఆయన చెప్పిన విషయాలు వింటే ఈ సినిమా క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయం.


ఇంతకీ దేవిశ్రీ ఏం చెప్పాడంటే.. ‘‘పుష్ఫ డిఫరెంట్ జోనర్‌లో ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. నా వరకు ఈ సినిమా కోసం బెస్ట్ మ్యూజిక్‌ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక సుక్కు.. ఈ గ్యాప్‌లో బన్నీ పాత్రని అద్భుతంగా చెక్కుతున్నారు. నా సినిమాలలో ఎప్పుడూ ఉండేలానే ఈ సినిమాలో కూడా ఓ గ్రాండ్ ఐటమ్ నెంబర్ ఉంటుంది..’’ అని చెప్పుకొచ్చాడు. సో.. బన్నీ ఫ్యాన్స్ పండుగ చేసుకోవడానికి ఇంకేం కావాలి.. చెప్పండి.

Updated Date - 2020-04-28T04:13:23+05:30 IST