పవన్ ఫ్యాన్స్‌‌కి హరీష్ ఇచ్చిన ట్రీట్ ఇదే

ABN , First Publish Date - 2020-05-12T03:34:20+05:30 IST

మే 11ని మరిచిపోలేని రోజుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి హరీష్ శంకర్ గిఫ్ట్ ఇచ్చాడు. వరుసగా 10 సంవత్సరాల పాటు సరైన హిట్ లేని పవన్ కల్యాణ్‌కు సరైన సినిమా పడితే

పవన్ ఫ్యాన్స్‌‌కి హరీష్ ఇచ్చిన ట్రీట్ ఇదే

మే 11ని మరిచిపోలేని రోజుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి హరీష్ శంకర్ గిఫ్ట్ ఇచ్చాడు. వరుసగా 10 సంవత్సరాల పాటు సరైన హిట్ లేని పవన్ కల్యాణ్‌కు సరైన సినిమా పడితే బాక్స్‌లు ఎలా బద్దలవుతాయో ‘గబ్బర్‌సింగ్’ సినిమాతో చూపించాడు. తమ హీరో హిట్ కొడితే చూద్దామని ఎంతో ఆశపడుతున్న ఫ్యాన్స్‌కి బ్లాక్‌బస్టర్ ఇచ్చి సంతోషపెట్టాడు. ఆ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ అభిమానులు సృష్టించిన అలజడికి ట్విట్టర్ కూడా షేకయింది. అయితే మరోసారి ఈ మే 11ని పవన్ ఫ్యాన్స్‌కి మెమరబుల్ డేగా మార్చాడు దర్శకుడు హరీష్ శంకర్.


మళ్లీ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయబోతున్న హరీష్ శంకర్.. బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్‌సింగ్’ కాంబో రిపీట్ కాబోతోంది అని చెబుతూ.. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. ‘‘ఇది అద్భుతమైన రోజు. 8 సంవత్సరాల క్రితం సినిమా విడుదల రోజు ఎంతో ఎనర్జీ వచ్చిందో.. ఇప్పుడూ అదే ఎనర్జీ వచ్చింది. ఆ సినిమాకున్న సంగీత శక్తిని మళ్లీ రీ క్రియేట్ చేయబోతున్నామని తెలియజేయడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదని అనుకుంటున్నాను. పవన్ కల్యాణ్‌గారితో నేను చేయబోతున్న చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. మేము మళ్లీ కలిసి పనిచేయబోతున్నాం. ఇప్పుడే మొదలైంది...’’ అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.Updated Date - 2020-05-12T03:34:20+05:30 IST