బిగ్‌బాస్‌4 మూడో ఎలిమినేటర్‌..!

ABN , First Publish Date - 2020-09-28T14:22:33+05:30 IST

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో మూడో ఎలిమినేషన్‌ పూర్తయ్యింది. యాంకర్‌, రిపోర్టర్‌ దేవీ నాగవల్లీ ఎలిమినేట్‌ అయ్యారు.

బిగ్‌బాస్‌4 మూడో ఎలిమినేటర్‌..!

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో మూడో ఎలిమినేషన్‌ పూర్తయ్యింది. యాంకర్‌, రిపోర్టర్‌ దేవీ నాగవల్లీ ఎలిమినేట్‌ అయ్యారు. గత సోమవారం ఏడుగురు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు. కల్యాణి బిగ్‌బాంబ్‌ కారణంగా నామినేషన్స్‌కు వచ్చిన దేవి ఓటింగ్‌లో వెనుకబడి చివరకు ఇంటిబాట పట్టారు. ఎలిమినేషన్స్‌ ముందు హోస్ట్‌ నాగార్జున ఇంటి సభ్యులతో గేమ్స్‌ ఆడించారు. చివరకు డాన్స్‌ చేయిస్తూ ఎలిమినేషన్స్‌ నుండి కంటెస్టెంట్స్‌ను సేవ్‌ చేస్తూ వచ్చారు. చివరకు కుమార్‌సాయి, దేవీ నాగవల్లీ ఎలిమినేషన్స్‌కు మిగిలారు. అందులో కుమార్‌ సాయి సేవ్‌ అయ్యాడు. దేవి ఎలిమినేషన్‌తో ఆరియానా బిగ్గరగా ఏడ్చేసింది. తను వెళ్లిపోతాననుకుంటే తను అక్కలాగా భావించే దేవి వెళ్లిపోవడంతో ఆమె కన్నీరు పెట్టుకున్నట్లు తెలియజేసింది. 


బిగ్‌బాస్ హౌస్‌ నుండి స్టేజ్‌పైకి వచ్చిన దేవీ నాగవల్లీ, అందరిపై పాజటివ్‌గానే స్పందించింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫేక్‌ గేమ్‌ ఆడలేరని చెప్పిన దేవి..ఒక్కొక్క కంటెస్టెంట్‌ గురించి పాజిటివ్‌ యాంగిల్‌లోనే మాట్లాడుతూ.. వారెలా ఉండాలనే దాన్ని తాను గమంచిన కోణంలో వివరించుకుంటూ వచ్చింది. చివరకు బిగ్‌బాంబ్‌ను ఎవరిపై వేస్తావు అని నాగ్‌ అడగ్గా, తనకు పాజిటివ్‌ బిగ్‌బాంబ్‌ కావాలని రిక్వెస్ట్‌ చేసి, వచ్చే వారం నామినేషన్స్‌ నుండి అరియానాను సేవ్‌ చేసింది. తన ఎలిమినేషన్‌కు కారణమేంటో తెలియలేదని, చెప్పిన దేవి.. చివరగా 'ఐ' సినిమాలోని పాట పాడి బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటకు వచ్చేసింది. 


Updated Date - 2020-09-28T14:22:33+05:30 IST