దేవాక‌ట్ట ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ థీమ్‌ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ABN , First Publish Date - 2020-08-14T15:18:35+05:30 IST

దేవాకట్ట దర్శకత్వంలో రూపొదుతున్న ‘ఇంద్రప్రస్థం’ థీమ్ మోష‌న్ పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

దేవాక‌ట్ట ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ థీమ్‌ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

దేవాక‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న త‌దుప‌రి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌ నారా చంద్ర‌బాబు నాయుడు, వై.ఎస్‌.ఆర్ మ‌ధ్య స్నేహం, రాజ‌కీయ వైరం ఆధారంంగా రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌కు ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా థీమ్ మోష‌న్ పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మూడు దశాబ్దాల పాటు వీరి మధ్య స్నేహం, పొలిటికల్ వైరల్ అనే అంశాల‌ను ఇందులో చూపిస్తున్నారు. ‘సాధార‌ణంగా ఓ కాంపీటీష‌న్ ప్ర‌ధాన ఉద్దేశం విజేత‌ను క‌నుక్కోవ‌డ‌మే. ఇద్ద‌రు స్నేహితులు ఓ పోటీలో పాల్గొన్న‌ప్పుడు అది చాలా ఆస‌క్తిక‌రంగా మారుతుంది’ అనే డైలాగ్ మోష‌న్ పోస్ట‌ర్‌ను దేవాక‌ట్ట వాయిస్ ఓవ‌ర్‌లో విడుద‌ల చేశారు. ఇందులో సీబీఎన్‌, వై.ఎస్‌.ఆర్‌ను పోలిన  షేడ్ ఇమేజ్‌ల‌ను కూడా ఇందులో చూపించారు. ప్రూడోస్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై హ‌ర్ష‌.వి, తేజ‌.సి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం దేవాక‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో సాయితేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం పూర్తి అయిన త‌ర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. 
Updated Date - 2020-08-14T15:18:35+05:30 IST