కోలీవుడ్‌లో ఢిల్లీ భామ

ABN , First Publish Date - 2020-03-08T15:50:00+05:30 IST

తమిళం తెలిసిన హీరోయిన్ల కంటే ఉత్తరాది లేదా ఇతర భాషాల హీరోయిన్లకే కోలీవుడ్‌లో ఎక్కువగా ఆదరణ ఉంటుందన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో పలువురు తమిళ

కోలీవుడ్‌లో ఢిల్లీ భామ

తమిళం తెలిసిన హీరోయిన్ల కంటే ఉత్తరాది లేదా ఇతర భాషాల హీరోయిన్లకే కోలీవుడ్‌లో ఎక్కువగా ఆదరణ ఉంటుందన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో పలువురు తమిళ హీరోయిన్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ తెరపై మరో ఉత్తరాది భామ మెరవబోతుంది. ఆమే ఢిల్లీకి చెందిన మోడల్‌ స్టెఫి పటేల్‌. 2014లో మిస్‌ ఇండియా టీన్‌ పోటీల్లో, 2018లో ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో కిరీటం గెల్చుకున్న ఈ సుందరాంగి.. అరివళగన్‌ దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. తమిళంలో ఆమెకిదే తొలి చిత్రం.

Updated Date - 2020-03-08T15:50:00+05:30 IST