పరువు హత్యా చిత్రమ్‌

ABN , First Publish Date - 2020-06-22T04:44:13+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ పరువుహత్య నేపథ్యంలో ఓ చిత్రం రూపొందిస్తున్నట్టు దర్శక-నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించారు...

పరువు హత్యా చిత్రమ్‌

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ పరువుహత్య నేపథ్యంలో ఓ చిత్రం రూపొందిస్తున్నట్టు దర్శక-నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించారు. ఆయన పర్యవేక్షణలో ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘మర్డర్‌’ టైటిల్‌ ఖరారు చేశారు. ‘కుటుంబ కథా చిత్రమ్‌’ అనేది ఉపశీర్షిక. ఫాదర్స్‌ డే సందర్భంగా ఆదివారం సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ‘‘అమృత, మారుతీరావు జీవితాల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. కుమార్తెను విపరీతంగా ప్రేమించే తండ్రి వల్ల ఎదురయ్యే అపాయమే చిత్రకథాంశాం. గుండెల్ని పిండేసే విధంగా ఉంటుంది. ఫాదర్స్‌ డే రోజున బాధపడే తండ్రుల సినిమా పోస్టర్‌ విడుదల చేస్తున్నాం’’ అని రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. ఈ చిత్రంలో అమృతగా సాహితీ అవంచ, మారుతీరావుగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కనిపించనున్నారు.


Updated Date - 2020-06-22T04:44:13+05:30 IST