భర్తతో దీపిక ముద్దూముచ్చట!

ABN , First Publish Date - 2020-05-26T16:51:54+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా కొద్దికాలంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది.

భర్తతో దీపిక ముద్దూముచ్చట!

కరోనా మహమ్మారి కారణంగా కొద్దికాలంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. సినిమా షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తన భర్త రణ్‌వీర్‌తో కలిసి ఇంట్లోనే సందడి చేస్తోంది. 


ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. తన భర్తకు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేస్తోంది. తాజాగా దీపిక పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్తకు ఘాటుగా ముద్దు పెడుతున్న వీడియోను దీపిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. 
Updated Date - 2020-05-26T16:51:54+05:30 IST