నా నటనను చూసి ఎగతాళి చేశారు: దీపికా పదుకొనె

ABN , First Publish Date - 2020-12-29T00:24:27+05:30 IST

తొలి సినిమానే బీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ సినిమాలో షారుఖ్‌తో సమానంగా

నా నటనను చూసి ఎగతాళి చేశారు: దీపికా పదుకొనె

ముంబై: తొలి సినిమా బీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ సినిమాలో షారుఖ్‌తో సమానంగా ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ చేసింది. అప్పటి నుంచి తన నటనతో దేశాన్ని ఉర్రూతలూగిస్తూ హాలీవుడ్‌‌లోనూ అరంగేట్రం చేసి భారతదేశ ఖ్యాతిని ప్రపంచం గుర్తించేలా చేసింది. ఇప్పటివరకు మనం చెప్పుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించే. అయితే ఈ స్టార్ హీరోయిన్ తన కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న అవమానాల గురించి తాజాగా నోరువిప్పింది. 


తొలి సినిమా ఓమ్ శాంతి ఓమ్‌లో తన యాక్టింగ్‌పై అనేక మంది ఎగతాళి చేశారని ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన యాస విషయంలో అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఈ బీవుడ్ సుందరి వెల్లడించింది. 21 ఏళ్లకే అవమానాలు ఎదురైతే ఆ ప్రభావం జీవితంపై కచ్చితంగా పడుతుందని, కానీ తాను అవమానాలను ఆయుధంగా మార్చుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చే స్థాయికి ఎదిగినట్టు దీపికా తెలిపింది. ‘19 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంతో ఆందోళన చెందాను. కానీ షారుఖ్ ఖాన్, ఫరా ఖాన్ చేయిపట్టి ముందుకు నడిపించారు’ అని దీపికా చెప్పింది.  కాగా.. కపిల్ దేవ్ బయోపిక్‌గా వస్తున్న 83 చిత్రంలో తన భర్త రణ్‌వీర్ సింగ్‌ సరసన దీపికా నటిస్తోంది.

Updated Date - 2020-12-29T00:24:27+05:30 IST