రాజుకు తగిన రాణి.. ప్రభాస్ సరసన దీపిక

ABN , First Publish Date - 2020-07-19T17:01:14+05:30 IST

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 21వ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాజుకు తగిన రాణి.. ప్రభాస్ సరసన దీపిక

ఎట్టకేలకు మన బాహుబలికి తగ్గ రాణిని సెలక్ట్ చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆమె ఎవరో కాదు.. దీపికా పదుకొనె. వివరాల్లోకెళ్తే.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 21వ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. హీరోయిన్‌గా ప్ర‌భాస్ స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై సోష‌ల్ మీడియాలో చాలా బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లే వినిపించాయి. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనె త‌మ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తున్నార‌ని దర్శక నిర్మాతలు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.


’కింగ్ పక్కన సరిపోయే క్వీన్ కావాలి కదా..చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. పిచ్చెక్కించేద్దాం’ అని అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. ‘బాహుబ‌లి’ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్ర‌భాస్ సినిమాల‌న్నీ పాన్ ఇండియా రేంజ్‌లోనే రూపొందుతున్నాయి. ‘సాహో’ కూడా పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ప్ర‌భాస్ 21ను కూడా అదే రేంజ్‌లో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా సినిమా రూపొందుతుంద‌ని స‌మాచారం. Updated Date - 2020-07-19T17:01:14+05:30 IST