విరాళం ఇవ్వలేను... స్టాఫ్ ను ఆదుకుంటా: ప్రముఖ నటుడు

ABN, First Publish Date - 2020-04-16T11:45:37+05:30

మన దేశంలో లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలు,పేద, అణగారిన వర్గాల ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

విరాళం ఇవ్వలేను...  స్టాఫ్ ను ఆదుకుంటా: ప్రముఖ నటుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన దేశంలో లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలు,పేద, అణగారిన వర్గాల ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని గుర్తించిన కొంతమంది మానవతా దృక్ఫథంతో మెలుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చిత్రంలో నటించిన దీపక్ డోబ్రియాల్ తన దగ్గర పనిచేసే వారిని ఈ కష్టకాలంలో ఆదుకుంటానని తెలిపారు. మీడియాతో దీపక్ మాట్లాడుతూ  తన  దగ్గర కొంతమంది పనిచేస్తున్నారన్నారు. వారికి పేమెంట్ చేసేందుకు రుణం తీసుకోవలసి వచ్చినప్పటికీ వారి జీతం ఆపనని చెప్పారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. తాను సంవత్సరంలో ఒక సినిమా చేస్తానని, విరాళం ఇవ్వడానికి తన  దగ్గర తగినంత డబ్బు లేదన్నారు.  

Updated Date - 2020-04-16T11:45:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!