విరాళం ఇవ్వలేను... స్టాఫ్ ను ఆదుకుంటా: ప్రముఖ నటుడు
ABN , First Publish Date - 2020-04-16T11:45:37+05:30 IST
మన దేశంలో లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలు,పేద, అణగారిన వర్గాల ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

మన దేశంలో లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలు,పేద, అణగారిన వర్గాల ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని గుర్తించిన కొంతమంది మానవతా దృక్ఫథంతో మెలుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చిత్రంలో నటించిన దీపక్ డోబ్రియాల్ తన దగ్గర పనిచేసే వారిని ఈ కష్టకాలంలో ఆదుకుంటానని తెలిపారు. మీడియాతో దీపక్ మాట్లాడుతూ తన దగ్గర కొంతమంది పనిచేస్తున్నారన్నారు. వారికి పేమెంట్ చేసేందుకు రుణం తీసుకోవలసి వచ్చినప్పటికీ వారి జీతం ఆపనని చెప్పారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. తాను సంవత్సరంలో ఒక సినిమా చేస్తానని, విరాళం ఇవ్వడానికి తన దగ్గర తగినంత డబ్బు లేదన్నారు.
Read more