రీ రిలీజ్ కానున్న 'డీడీఎల్‌జే'
ABN , First Publish Date - 2020-10-23T17:16:34+05:30 IST
షారూక్‌ఖాన్, కాజోల్ జంటగా నటించిన చిత్రం 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగె' సినిమా విడుదలై పాతికేళ్లవుతుంది. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో యష్ చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.

షారూక్‌ఖాన్, కాజోల్ జంటగా నటించిన చిత్రం 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగె' సినిమా విడుదలై పాతికేళ్లవుతుంది. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో యష్ చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. సినిమాలోని పాటలు ఇప్పటికీ మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ముంబైలో ఓ థియేటర్‌లో ఎక్కువ రోజులు రన్ అయిన సినిమాగా కూడా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాతలు సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. అది ఒకట్రెండు దేశాల్లో కాదు.. ఏకంగా 18 దేశాల్లో. యు.కె, యు.ఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఫిజి, స్పెయిన్, స్పీడన్, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, కెనడా, జర్మనీ దేశాల్లో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.