దాని గురించి బోయపాటినే అడగాలి: కేథరిన్

ABN , First Publish Date - 2020-02-08T18:12:08+05:30 IST

`ఇద్దరమ్మాయిలతో` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ కేథరిన్ ట్రెసా.

దాని గురించి బోయపాటినే అడగాలి: కేథరిన్

`ఇద్దరమ్మాయిలతో` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ కేథరిన్ ట్రెసా. ఆ తర్వాత పలు సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ పాత్రలు చేసింది. అలాగే కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్‌లు కూడా చేసింది. తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలో ఒక కథానాయికగా నటించింది. 


నటరత్న నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలో కేథరిన్ కథానాయికగా ఫిక్స్ అయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ సినిమా నుంచి కేథరిన్‌ను తప్పించారని ఆ తర్వాత టాక్ బయటకు వచ్చింది. బోయపాటి సినిమా గురించి తాజాగా మీడియా ముందుకు వచ్చిన కేథరిన్ మాట్లాడింది. `బోయపాటి, బాలక‌ృష్ణ సినిమాలో నన్ను తీసుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తీసేసారనీ రాశారు. ఆ సినిమా గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఆ సినిమాలో నేను నటిస్తున్నానో, లేదో మీరు బోయపాటినే అడగండ`ని కేథరిన్ చెప్పింది.  

Updated Date - 2020-02-08T18:12:08+05:30 IST