సింగర్ సునీత పేరు చెప్పి మోసం చేస్తున్న చైతన్య అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-08T01:55:52+05:30 IST

సింగర్ సునీత పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో మోసానికి పాల్పడుతున్న చైతన్య‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘నేను అందరికీ ఒక విషయంపై

సింగర్ సునీత పేరు చెప్పి మోసం చేస్తున్న చైతన్య అరెస్ట్

సింగర్ సునీత పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో మోసానికి పాల్పడుతున్న చైతన్య‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని మోసాల గురించి తెలుసుకున్న గాయని సునీత ఇప్పటికే స్పందించారు.... ‘‘నేను అందరికీ ఒక విషయంపై క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చైతన్య అనే అతను నా మేనల్లుడు అని చెప్పి, సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకుంటున్నాడట. అవకాశాలు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని కూడా తెలిసింది. ఇది తెలిసి నేను షాక్ అయ్యాను. నాకసలు చైతన్య అనే మేనల్లుడు లేనే లేడు. దయచేసి ఇకపై ఎవరూ మోసపోకండి. మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా చెబుతున్నాను. అయినా ప్రతి రోజూ ఇలా ఇండస్ట్రీలో మోసాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా ఎలా మోసపోతున్నారు. సెలబ్రిటీకి చుట్టం అనగానే ఎందుకు వారికి డబ్బులిచ్చి మోసపోతున్నారు. కొంచమైనా ఆలోచించరా? ఇకపై బయటి వ్యక్తులు ఎవరైనా ఇలా చెబితే కాస్త ఆలోచించండి. డబ్బులు పోగోట్టుకోవద్దు. ఆ చైతన్య అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు..’’ అని సునీత తెలుపుతూ.. అతనిపై సైబర్‌ క్రైమ్ పోలీసులకు రిపోర్ట్ చేస్తున్నట్లుగా ఇటీవల ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.


అయితే సింగర్ సునీత పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో మోసానికి పాల్పడుతున్న చైతన్య‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి, అతని వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిసింది. సింగర్ సునీత చెప్పినట్లుగా ఇటువంటి మోసాలు చేస్తున్న వారు ఇటీవల ఎక్కువైపోయారు. అయినా సరే.. సినిమా అవకాశాలు అనగానే కొందరు ఏమీ ఆలోచించకుండా.. నమ్మేస్తున్నారు. ఇకనైనా అటువంటి వారు జాగ్రత్త పడతారేమో చూద్దాం. 

Updated Date - 2020-08-08T01:55:52+05:30 IST

Read more