మరో తారకి కరెంట్ బిల్ షాక్

ABN , First Publish Date - 2020-07-27T03:28:04+05:30 IST

బాలీవుడ్‌లోని మరో తారకి కరెంట్ బిల్ షాక్ తగిలింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా కరెంట్ రీడింగ్ తీయడం వీలు పడక.. ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రీడింగ్‌తో

మరో తారకి కరెంట్ బిల్ షాక్

బాలీవుడ్‌లోని మరో తారకి కరెంట్ బిల్ షాక్ తగిలింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా కరెంట్ రీడింగ్ తీయడం వీలు పడక.. ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రీడింగ్‌తో బిల్స్ ఇవ్వడంతో.. వందల్లో బిల్ వచ్చేవారికి వేలల్లో, అలాగే వేలల్లో వచ్చేవారికి లక్షల్లో కరెంట్ బిల్స్ వచ్చాయి. దీంతో అందరూ సోషల్ మీడియా వేదికగా.. తమ బాధను విన్నవించుకున్నారు. ఇందులో అధికంగా సెలబ్రిటీలే ఉండటం విశేషం. బాలీవుడ్‌లో తాప్సీ, రీచా చడ్డా, సోహా అలీఖాన్ వంటి వారు కరెంట్ బిల్స్‌పై ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఉన్నారు. ఇప్పుడు అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మరో తార.. తనకు రూ. 51000 కరెంట్ బిల్ వచ్చినట్లుగా ట్వీట్ చేసింది. ఇంతకీ ఎవరా తార అనుకుంటున్నారా? ఇంకెవరు.. దివ్యా దుత్తా. 


‘‘డియర్ టాటా పవర్.. ఏమైంది మీకు.. ఒక నెలకి కరెంట్ బిల్ రూ. 51000? లాక్‌డౌన్ గిఫ్ట్‌గా ఏమైనా ఇవ్వాలా? దీనిని త్వరగా క్రమబద్ధీకరించండి..’’ అని దివ్యా దుత్తా తన ట్వీట్‌లో పేర్కొంది. దీనికి టాటా పవర్ వారు స్పందించి.. మా సంస్థ నుంచి మీకు ఫోన్ చేస్తారు.. వివరాలు తెలపండి.. అని రిప్లయ్ ఇచ్చారు. దీనికి దివ్యా దుత్తా.. ‘‘ఒకతను ఫోన్ చేశాడు. అతను నా ప్రాబ్లమ్ సరిచేస్తాడని ఆశిస్తున్నాను. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి షాక్‌లు ఇవ్వకుండా ఉండగలరని ఆశిస్తున్నాను. నా సమస్యపై స్పందించినందుకు ధన్యవాదాలు..’’ అని దివ్యా దుత్తా పేర్కొంది. Updated Date - 2020-07-27T03:28:04+05:30 IST

Read more