ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2020-10-05T20:19:33+05:30 IST

ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా సోఫియా వెర్గారా అగ్ర స్థానంలో నిలిచింది

ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి ఎవరో తెలుసా?

ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా సోఫియా వెర్గారా అగ్ర స్థానంలో నిలిచింది. అమెరికా టీవీ షో `ది మోడ్రన్ ఫ్యామిలీ` కార్యక్రమంతో బాగా ప్రాచుర్యం సంపాదించిన సోఫియా ఏడాది కాలంలో ఏకంగా 43 మిలియన్ డాలర్లు (రూ.315 కోట్లు) ఆర్జించిందట. ప్రముఖ నటి ఏంజెలినా జోలీ (35.5 మిలియన్ డాలర్లు)ని కూడా సోఫియా దాటేయడం విశేషం. ఈ మేరకు ఫోర్బ్స్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.


సోఫియా, ఏంజెలీనా తర్వాతి స్థానాల్లో గాల్ గాడోట్ (31 మిలియన్ డాలర్స్), మెలిస్సా మెక్‌కార్తీ (25 మిలియన్ డాలర్స్), మెరిల్ స్ట్రీప్ (24 మిలియన్ డాలర్స్) తదితరులు ఉన్నారు. పలు సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సోఫియాను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏకంగా 20.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. 

Updated Date - 2020-10-05T20:19:33+05:30 IST