లాక్‌డౌన్ త‌రువాత ఇంటిమేట్ సీన్స్ ఎలా షూట్ చేస్తారంటే...

ABN , First Publish Date - 2020-05-11T18:07:47+05:30 IST

కరోనా మ‌హ‌మ్మారి మ‌ప్పు నేప‌ధ్యంలో లాక్‌డౌన్ ఎత్తివేశాక అన్ని రంగాల్లో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా సీనీ, టీవీ రంగాల్లో ఇంటిమేట్ సీన్స్ ఎలా చిత్రీక‌రిస్తార‌నే దానిపై ప‌లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

లాక్‌డౌన్ త‌రువాత ఇంటిమేట్ సీన్స్ ఎలా షూట్ చేస్తారంటే...

కరోనా మ‌హ‌మ్మారి మ‌ప్పు నేప‌ధ్యంలో లాక్‌డౌన్ ఎత్తివేశాక అన్ని రంగాల్లో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా సీనీ, టీవీ రంగాల్లో ఇంటిమేట్ సీన్స్ ఎలా చిత్రీక‌రిస్తార‌నే దానిపై ప‌లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం అటు సినిమాల్లో, ఇటు టీవీ సీరియ‌ల్స్‌లో బోల్డ్ సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్స్ సాధార‌ణ‌మైపోయాయి. లాక్‌డౌన్‌ తర్వాత వీటిని చిత్రీకరించే విధానంలో మార్పురానుంది. విదేశాల్లోని చిత్రరంగం విషయానికొస్తే  తైవాన్‌లో వెబ్, టీవీ షోలలో ముద్దు సన్నివేశాలను నిషేధించారు. ప్రపంచంలో అత్యధిక అడల్ట్  కంటెంట్ ఉండే  హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంటిమేట్ సీన్ల కోసం మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. యూకేలో టీవీ షోల‌లో కిస్సింగ్ సీన్ల‌ను నిషేధించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న‌ కారణంగా వెబ్ సిరీస్‌కు డిమాండ్ పెరిగింది. అయితే ఈ డిమాండ్‌కు అనుగుణంగా కంటెంట్ ల‌భ్యం కావ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఉల్లూ డిజిట‌ల్ సీఈఓ విభూ అగర్వాల్ మాట్లాడుతూ బోల్డ్ సీక్వెన్సులలో నటులమ‌ధ్య‌ భౌతిక దూరం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అటువంటి స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డం క‌ష్ట‌మ‌ని అన్నారు. ప్ర‌స్తుతం తాము షార్ట్ ఫిల్మ్ షూటింగ్స్ నిలిపివేశామ‌ని తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తివేశాక త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో షూటింగ్ ప్రారంభిస్తామ‌ని, స్క్రిప్టులో త‌గిన మార్పులు చేస్తామ‌ని పేర్కొన్నారు. 


Updated Date - 2020-05-11T18:07:47+05:30 IST