రాజశేఖర్‌ కుటుంబానికి కరోనా

ABN , First Publish Date - 2020-10-18T06:36:09+05:30 IST

కథానాయకుడు రాజశేఖర్‌ సహా ఆయన కుటుంబ సభ్యులందరూ కొవిడ్‌-19 బారిన పడ్డారు. కుమార్తెలు శివానీ, శివాత్మిక... ఇద్దరూ కోలుకోగా, సతీమణి జీవిత సహా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు..

రాజశేఖర్‌ కుటుంబానికి కరోనా

కథానాయకుడు రాజశేఖర్‌ సహా ఆయన కుటుంబ సభ్యులందరూ కొవిడ్‌-19 బారిన పడ్డారు. కుమార్తెలు శివానీ, శివాత్మిక... ఇద్దరూ కోలుకోగా, సతీమణి జీవిత సహా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ‘‘నాతో సహా జీవిత, ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మాట వాస్తవమే. ప్రస్తుతం నేనో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా. పిల్లలిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. నేను, జీవిత ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉన్నాం. త్వరలో ఇంటికి చేరుకుంటాం. థ్యాంక్యూ!’’ అని రాజశేఖర్‌ ట్వీట్‌ చేశారు. సినిమాల విషయానికి వస్తే... ‘కల్కి’ తర్వాత ఆయన పలు కథలు వింటున్నారు. త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పుడు ఆయన కోలుకున్న తర్వాత ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 

Updated Date - 2020-10-18T06:36:09+05:30 IST