తమన్నాకు కరోనా

ABN , First Publish Date - 2020-10-05T08:01:16+05:30 IST

మిల్కీబ్యూటీ తమన్నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఆమె వారం రోజులుగా హైటెక్‌సిటీ సమీపంలోని ఓ హోటల్‌లో...

తమన్నాకు కరోనా

మిల్కీబ్యూటీ తమన్నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఆమె వారం రోజులుగా హైటెక్‌సిటీ సమీపంలోని ఓ హోటల్‌లో జరుగుతున్న ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రెండ్రోజులుగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వైద్యుల సలహా, సూచనలతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దాంతో వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ ఆగిపోయింది. ఇటీవల తన తల్లిదండ్రులు కరోనా బారిన పడికోలుకున్న సంగతి తెలిసిందే! ప్రస్తుతం తమన్నా తల్లిదండ్రులు ఆమెతోనే ఉన్నారు. ‘సీటీమార్‌’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘అంధాదున్‌’ తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. 


Updated Date - 2020-10-05T08:01:16+05:30 IST

Read more