నిర్మాత దానయ్యకు కరోనా
ABN , First Publish Date - 2020-08-08T06:28:37+05:30 IST
నిర్మాత డీవీవీ దానయ్య కొవిడ్-19 బారిన పడ్డారు. ఇటీవల ఆయనకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ..

నిర్మాత డీవీవీ దానయ్య కొవిడ్-19 బారిన పడ్డారు. ఇటీవల ఆయనకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారట. కొన్ని రోజుల కిత్రం ఆయన హార్ట్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వైరస్ బారిన పడ్డారు. తెలుగు చిత్రపరిశ్రమను చాపకింద నీరులా కరోనా చుట్టేస్తున్నట్టుంది. నిర్మాత బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకోగా... దర్శకులు రాజమౌళి, తేజ, గాయనీగాయకులు స్మిత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఈ మహమ్మారి సోకడంతో చికిత్స తీసుకుంటున్నారు. చిన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.