‘కరోనా రక్కసి’ ఆల్బమ్‌ను ఆవిష్కరించిన వి .వి .వినాయక్

ABN , First Publish Date - 2020-06-16T19:58:27+05:30 IST

కరోనా ప్రభావంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రజలను చైతన్యం చేసే లక్ష్యంతో రూపొందిన ‘కరోనా రక్కసి’ అనే పాటల ఆల్బమ్ను ప్రముఖ సినీ దర్శకులు వి .వి . వినాయక్ ఆవిష్కరించారు.

‘కరోనా రక్కసి’  ఆల్బమ్‌ను  ఆవిష్కరించిన  వి .వి .వినాయక్

కరోనా ప్రభావంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ  నేప‌థ్యంలో ప్రజలను చైతన్యం  చేసే లక్ష్యంతో  రూపొందిన  ‘కరోనా రక్కసి’ అనే  పాటల  ఆల్బమ్ను  ప్రముఖ  సినీ దర్శకులు  వి .వి . వినాయక్  ఆవిష్కరించారు. బాబ్జీ రచించిన ఈ పాటలను  ప్రజా నాట్యమండలి  గాయకుడు  లక్ష్మణ్  పూడి ఆలపించారు.  యువ సంగీత దర్శకుడు  ప్రేమ్ స్వరాలను అందించారు. ఈ సంధర్భంగా  వి .వి .వినాయక్  మాట్లాడుతూ ‘‘కరోనాను చూసి మనం భయపడటం చేయకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా బలంగా ఉన్నవారు.. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి సాయపడండి. మానవత్వాన్ని  చాటాలని,  ప్రజలను చైతన్య పరిచేందుకై  యీ పాటల ఆల్బమ్‌ను రూపొందిన  బాబ్జీ  , లక్ష్మణ్  పూడిగారికి అభినందనలు‘‘ అన్నారు. 


రచయిత  బాబ్జీ   మాట్లాడుతూ  ‘‘సమాజంలో  ఏ విపత్తు  వచ్చినా  స్పందించడం,  ప్రజల పక్షాన  నిలబడడం  కళాకారుల  బాధ్యత. ఆ బాధ్యతతోనే  యీ పాటలను రూపొందించాం’’అన్నారు. ఆల్బమ్  రూపకర్త  లక్ష్మణ్ పూడి  మాట్లాడుతూ ‘‘ లాక్ డౌన్  ఎత్తి వేసిన తరువాత  ప్రజలలో  నిర్లక్ష్య ధోరణి  కనిపిస్తుంది.  ఎవరికి  వాళ్ళు  మాకు  ఏమి కాదు అనే భావన తో  బయట తిరుగుతున్నారు.  అలాంటి  జనాన్ని  చైతన్యపరచడానికే  యీ  పాటలను  రూపొందించాం’’ అన్నారు. 

Updated Date - 2020-06-16T19:58:27+05:30 IST