హీరో వరుణ్‌తేజ్‌కు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-12-29T22:07:52+05:30 IST

మెగా ఫ్యామిలీలో మరో హీరో వరుణ్‌తేజ్‌కు కరోనా పాజిటివ్‌ సోకింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

హీరో వరుణ్‌తేజ్‌కు కరోనా పాజిటివ్‌

మెగా ఫ్యామిలీలో మరో హీరో వరుణ్‌తేజ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. స్వల్ప కోవిడ్‌ లక్షణాలున్న తాను టెస్ట్‌ చేయించుకోగా కరోనా సోకినట్లు వరుణ్‌ తెలిపారు. తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని తెలిపిన వరుణ్‌తేజ్‌. తనపై ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు వరుణ్‌తేజ్‌. మంగళవారం ఉదయమే హీరో రామ్ చరణ్ తనకు కరోనా సోకినట్లు వెల్లడించారు. 
Updated Date - 2020-12-29T22:07:52+05:30 IST