పృథ్వీ, స్మితకు కరోనా పాజిటివ్‌!

ABN , First Publish Date - 2020-08-05T05:56:45+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. హాస్యనటుడు పృథ్వీ, పాప్‌ సింగర్‌ స్మిత కొవిడ్‌ బారినపడ్డారు. సోషల్‌ మీడియా వేదికగా వారిద్దరు ఈ విషయాన్ని వెల్లడించారు...

పృథ్వీ, స్మితకు కరోనా పాజిటివ్‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. హాస్యనటుడు పృథ్వీ, పాప్‌ సింగర్‌ స్మిత కొవిడ్‌ బారినపడ్డారు. సోషల్‌ మీడియా వేదికగా వారిద్దరు ఈ విషయాన్ని వెల్లడించారు. 10 రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్న పృథ్వీ కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదివారం రాత్రి ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. పాప్‌ సింగర్‌, స్మితకు, ఆమె భర్త శశాంక్‌కు కరోనా సోకినట్లు ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘ఆదివారం బాగా ఒళ్లు నొప్పులు ఉండడంతో అనుమానంతో టెస్ట్‌ చేయించగా కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఇంటిపట్టునే క్షేమంగా ఉన్నప్పటికీ కొవిడ్‌ బారినపడ్డాం. త్వరగా కరోనాని జయించి, ప్లాస్మా దానం చేేసందుకు సిద్థంగా ఉన్నాం’’ అని స్మిత పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-05T05:56:45+05:30 IST