కృతి సనన్‌కి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-12-08T17:33:29+05:30 IST

హీరోయిన్ కృతిసనన్‌కి కరోనా పాజిటివ్‌గా అని బాలీవుడ్ వర్గాల సమాచారం.

కృతి సనన్‌కి కరోనా పాజిటివ్‌

హీరోయిన్ కృతిసనన్‌కి కరోనా పాజిటివ్ అని బాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ రావ్‌తో కలిసి ఓ సినిమాలో కృతిసనన్‌ నటిస్తుంది. రీసెంట్‌గా చంఢీఘర్‌లో ఈ సినిమా షూటింగ్‌  చేశారు. అక్కడి నుండి వచ్చిన తర్వాత కృతికి కోవిడ్‌ సోకిందని అంటున్నారు. మహేశ్‌ '1 నేనొక్కడినే'తో హీరోయిన్సి గా కెరీర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కృతి సనన్ తర్వాత నాగచైతన్యతో 'దోచెయ్'‌ సినిమాలోనూ జోడీ కట్టింది. అయితే ఈ రెండు సినిమాలు సక్సెస్‌ కాకపోవడంతో కృతిసనన్‌కి తెలుగులో అవకాశాలు రాలేదు. అదే సమయంలో కృతికి బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో అక్కడే బిజీ హీరోయిన్‌ అయ్యింది. ఇప్పుడు ప్రభాస్‌ 'ఆదిపురుష్‌'లో కృతిసనన్‌, సీత పాత్రను చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. 


Updated Date - 2020-12-08T17:33:29+05:30 IST