కరోనా... మేడిన్‌ చైనా!

ABN , First Publish Date - 2020-05-12T05:24:03+05:30 IST

‘‘మానవాళి చర్యల ఫలితమే ప్రకృతిలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులకు కారణమనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది...

కరోనా... మేడిన్‌ చైనా!

‘‘మానవాళి చర్యల ఫలితమే ప్రకృతిలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులకు కారణమనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. మేం రాసుకున్న సన్నివేశాలే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నాయి’’ అని తల్లాడ సాయికృష్ణ అన్నారు. అతడు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కరోనా... మేడిన్‌ చైనా’. హనీ, శోభన హీరోయిన్లు. తల్లాడ శ్రీనివాస్‌ నిర్మాత. ఇటీవల టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ‘‘ఫిబ్రవరిలో సినిమా ప్రారంభించి, 40 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌ ఆపేశాం’’ అని నిర్మాత తెలిపారు.  

Updated Date - 2020-05-12T05:24:03+05:30 IST