కరోనా ఇలా మార్చేసింది!

ABN , First Publish Date - 2020-11-04T06:43:20+05:30 IST

సినిమాల్లోనే కాదు అలా బయటకెళ్లినప్పుడు కూడా అందమైన దుస్తుల్లో కనిపించి కనువిందు చేస్తుంటారు బాలీవుడ్‌ బ్యూటీ...

కరోనా ఇలా మార్చేసింది!

సినిమాల్లోనే కాదు అలా  బయటకెళ్లినప్పుడు కూడా  అందమైన దుస్తుల్లో కనిపించి  కనువిందు చేస్తుంటారు  బాలీవుడ్‌ బ్యూటీ కట్రీనా కైఫ్‌. లేటెస్ట్‌  ఫ్యాషన్‌ దుస్తుల్లో మెరిసిపోయే కట్రీనా ఇప్పుడు తన రూటు మార్చారు. కారణం కరోనా.  కొవిడ్‌ -19 భయంతో అందరూ వణికిపోతున్నారు. నలుగురిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా  కోరల్లో చిక్కుకున్నట్లే. అందుకే కట్రీనా కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నారు. మాస్క్‌ తప్పనిసరిగా వాడుతున్నారు.   ప్రస్తుతం కట్రీనా  ‘సూపర్‌హీరో,  ‘ఫోన్‌ బూత్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. షూటింగ్స్‌కు  వెళ్లాలంటే విమాన ప్రయాణం తప్పనిసరి. ఆ ప్రయాణంలో  మాస్క్‌తో పాటు ఫేస్‌షీల్డ్‌, పీపీఈ కిట్‌ను ధరించాలి.   వాటిని ధరించిన  ఫొటోను కట్రీనా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి ‘‘దుస్తులు బాగున్నా లేకున్నా, మనం  సురక్షితంగా ఉండడం ముఖ్యం’’ అనే వ్యాఖ్యను జోడించారు.

Updated Date - 2020-11-04T06:43:20+05:30 IST

Read more