కరణ్‌ ఇంట్లో కరోనా

ABN , First Publish Date - 2020-05-27T05:34:29+05:30 IST

హిందీ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది. సోమవారం రాత్రి ఈ సంగతి ట్వీట్‌ చేశారాయన. ‘‘మా ఇంట్లో పని చేస్తున్న ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించగా...

కరణ్‌ ఇంట్లో కరోనా

హిందీ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది. సోమవారం రాత్రి ఈ సంగతి ట్వీట్‌ చేశారాయన. ‘‘మా ఇంట్లో పని చేస్తున్న ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించగా... వైద్య పరీక్షలు చేయించాం. కొవిడ్‌-19 పాజిటివ్‌ అని వచ్చింది. వాళ్లను మా ఇంటిలో ప్రత్యేకంగా ఓ గదిలో క్వారంటైన్‌ చేశాం. బాంబే మున్సిపల్‌ కార్పోరేషన్‌కి సమాచారం అందించాం. వాళ్లు ఇల్లంతా శానిటైజ్‌ చేసి, శుభ్రం చేశారు. కుటుంబ సభ్యులు, మిగతా సిబ్బందికి వైద్య పరీక్షలు చేయగా, నెగెటివ్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. అయినా చుట్టుపక్కల వాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 14 రోజులు స్వీయ నిర్భంధంలో ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని కరణ్‌ జోహార్‌ తెలిపారు.


Updated Date - 2020-05-27T05:34:29+05:30 IST