లాక్‌డౌన్‌లోనూ బాల సుబ్రహ్మణ్యం బిజీ బిజీ.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2020-04-28T23:12:19+05:30 IST

కళ కళ కోసం కాదు ప్రజా శ్రేయస్సు కోసమే అన్నారు పెద్దలు. జనం కష్టాల్లో ఉన్నప్పుడు కళాకారులు వారి శ్రేయస్సు కోరి చేసే ..

లాక్‌డౌన్‌లోనూ బాల సుబ్రహ్మణ్యం బిజీ బిజీ.. ఎందుకో తెలుసా?

కళ కళ కోసం కాదు ప్రజా శ్రేయస్సు కోసమే అన్నారు పెద్దలు. జనం కష్టాల్లో ఉన్నప్పుడు కళాకారులు వారి శ్రేయస్సు కోరి చేసే ప్రతి వితరణ సేవలాంటిదే. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గాన కళతో కరోనా మహమ్మారిని తరిమేసేందుకు గళం విప్పారు. జనం కోరిన పాటను తన నోట పలికించి కరోనాను తరిమేయడానికి నిధిని సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి బాల సుబ్రహ్మణ్యం లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. 


ఈ సందర్భంగా బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘‘లాక్‌డౌన్‌తో చాలా బిజీ అయ్యా. నేను చాలా ఆశా వాదిని. నా ఆలోచనలన్నీ కూడా పాజిటివ్‌గా ఉంటాయి. చెడులోనూ గొప్ప విషయాన్ని తీసుకోవాలనే తాపత్రయంతో ముందుకు వెళతా. కరోనా వల్ల ప్రపంచం మొత్తం కష్టపడుతోంది. కరోనా కట్టడి కోసం పాటు పడుతున్న ప్రతి ఒక్కరికీ కూడా పాద నమస్కారాలు. నా 54 ఏళ్ల జీవితంలో నెల రోజులు ఇంట్లో ఉన్నది ఎప్పుడూ లేదు. రెండు చేదు అనుభవాల్లో మాత్రమే కాస్త ఎక్కువ రోజులు ఇంట్లో గడిపే సమయం వచ్చింది. కానీ ఈ లాక్ డౌన్‌తో నెల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యా. ఇది చాలా చాలా విశేషం.’’ అని అన్నారు. 

Updated Date - 2020-04-28T23:12:19+05:30 IST