జయప్రకాశ్‌ రెడ్డి మృతికి సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపాలు

ABN , First Publish Date - 2020-09-08T14:56:04+05:30 IST

జయప్రకాశ్ రెడ్డి మృతిపై పలు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జయప్రకాశ్‌ రెడ్డి మృతికి సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపాలు

ప్రముఖ సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి(74) మంగళవారం ఉదయం గుండెపోటుతో గుంటూరులో కన్నుమూశారు. ఆయన మృతిపై పలు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


రాయలసీమ యాసతో, సహజమైన నటనతో అలరించిన నటుడు జయప్రకాశ్‌ రెడ్డి. స్నేహశీలి. ఆయన పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో తనదైన నటనతో ముద్రవేసి జేపీలాంటి నటుడ్ని కోల్పోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు  - ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు


జయప్రకాశ్‌ రెడ్డిగారు తనదైన ప్రత్యేకమైన నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఎన్నో మరపురాని ప్రాత్రలను పోషించారు. వారి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను ..ఓం శాంతి             - ప్రధాని నరేంద్ర మోడి


జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం నన్ను దిగ్ర్భాంతికి గురిచేసింది. విలక్షణ నటనతో తెలుగు చిత్రసీమకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన కటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను                                       - కేంద్ర మంత్రి అమిత్‌ షా

జయప్రకాశ్‌ రెడ్డి మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపాన్ని ప్రకటించారు. అనేక సినిమాల్లో విభిన్నపాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్‌ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

జయప్రకాశ్‌ రెడ్డి మృతిపై ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ సంతాపాన్ని తెలిపారు. జేపీ తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. 

జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణంతో తెలుగు సినిమా, నాటక రంగం ఓ జెమ్‌ను కోల్పోయింది. దశాబ్దాలుగా ఆయన విలక్షణ నటనతో మనకు అద్భుతమైన సినీ క్షణాలను అందించారు. నా గుండె శోకంతో నిండిపోయింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను            - ఎన్‌.చంద్రబాబు నాయుడు


సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. జయప్రకాశ్‌ రెడ్డిగారితో నేను ఆఖరిగా చేసిన సినిమా ఖైదీ నంబర్‌ 150. ఆయన గొప్ప నటుడు "నాటక రంగం నన్ను కన్నతల్లి. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి" అనేవారు. "అందుకే ఇప్పటికీ శని, ఆది వారాల్లో షూటింగ్స్‌ పెట్టుకోనండి. స్జేజ్‌ పెర్ఫామెన్స్‌ ఇస్తుంటాను. మీరెప్పుడైనా రావాలి" అనేవారు. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయాను. సినిమాల్లోరాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ అంటే మొదట గుర్తుకు వచ్చేది జయప్రకాశ్‌ రెడ్డిగారే. తనకంటూ ఓ ప్రత్యేకమైన ట్రెండ్‌ను సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను                   

                                                                                     - చిరంజీవి


ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను                                                        - నందమూరి బాలకృష్ణ


జయప్రకాశ్‌ రెడ్డిగారు ఫైన్‌ జెంటిల్‌మేన్‌. ఆయన కటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి                                       - నాగార్జున అక్కినేని



నా స్నేహితుడు జయప్రకాశ్‌ రెడ్డి మరణంతో షాకయ్యాను. నాది, ఆయనది సిల్వర్‌ స్క్రీన్‌పై అద్భుతమైన కాంబినేషన్‌. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం                                                   - వెంకటేశ్‌

జయప్రకాష్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పదిమందికి సహాయం చెయ్యాలనే వ్యక్తి తను.  జయప్రకాష్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను     -  మంచు మోహన్ బాబు


ప్రముఖ నటులు జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం దిగ్ర్భాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. జయప్రకాశ్‌రెడ్డిగారి కటుంబానికి నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రాయలసీమ మాండలికాన్ని పలకడంలో తనదైన బాణీని జయప్రకాశ్‌రెడ్డిగారు చూపారు. నాటక రంగం నుండి వచ్చిన ఆయన ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు. గబ్బర్‌సింగ్‌లో పోలీస్‌ కమీషనర్‌గా ఆయన నటించారు. పాత్ర ఏదైనా చక్కగా ఒదిగిపోయేవారు. చిత్ర రంగంలో ఎంత బిజీగా ఉన్నా, నాటక రంగాన్ని మాత్రం మరువలేదు. తెలుగు సినీ, నాటక రంగాలకు జయప్రకాశ్‌రెడ్డిగారి మరణం తీరని లోటు                    - పవన్‌కల్యాణ్‌


ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం ఎంతో బాధాకరం. ఆయన చేసిన ప్రతి పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. సమరసింహారెడ్డి చిత్రంలో విలన్‌గా అద్భుతంగా నటించారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను 
                                           
                                      - నారా లోకేశ్‌

జయప్రకాశ్‌ రెడ్డిగారు చనిపోవడం చాలా బాధాకరం. అయనొక అద్భుతమై నటుడు, కమెడియన్‌. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలను మరచిపోలేను. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను 
                                                                                       - మహేశ్‌ 

అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.                                  -  తారక్‌


జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణవార్తలను తెలియగానే షాకయ్యాను. మనసంతా బాధతో నిండిపోయింది. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలెంతో గొప్పవి. దశాబ్దాలుగా విలన్‌, కామెడీ పాత్రలో ఆయన మనల్ని ఎంటర్‌టైన్‌ చేసినందుకు ఆయనకు థాంక్స్‌. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను                                 - ఎస్‌.ఎస్‌.రాజమౌళి


సహచర నటుడు జయప్రకాష్ రెడ్డి గారు  హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసినందుకు ధన్యవాదాలు 

                                                                                       - ప్రకాశ్‌ రాజ్‌ 


ప్రియమైన జయప్రకాశ్‌ రెడ్డిగారు మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసినందుకు ధన్యవాదాలు. నేను రెఢీ సెట్‌లో మిమ్మల్ని కలిసి నప్పుడు ఆశ్చర్యపోయాను. మీ ఆత్మకు శాంతి కలగాలి                               - రామ్‌ పోతినేని


మై డియర్‌ అంకుల్‌. నా కెరీర్‌ ప్రారంభం నుండి మీరు నాకు తెలుసు. మీరు నాపై చూపించిన ప్రేమ, వాత్సల్యం నేనెప్పటికీ మరచిపోలేను. ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చేసేవారు. నాతో ఫోన్‌లో మాట్లాడిన ప్రతీసారి.. నాన్న నువ్వు, నేను సినిమా రంగానికి చెందినవాళ్లం అని చెప్పేవారు. మీ మాటలు నాకెప్పటికీ గుర్తే. అది మీ ఆశీర్వాదంగా భావిస్తాను. మీ ఆత్మకు శాంతి కలగాలి                                                                                                                    - శ్రీనువైట్ల


మేమందరం జేపీ అని పిలుచుకునే జయప్రకాశ్‌ రెడ్డి, తను సడెన్‌గా కన్నుమూయారనడం చాలా దారుణమైన వార్త. చాలా డీప్‌ షాక్‌లో ఉన్నాం. నాటక రంగం నుండి సినీ రంగానికి వచ్చిన జేపీ తనకంటూ ఓ బాణీని క్రియేట్‌ చేసుకున్నారు. భయంకరమైన విలన్‌గానే కాదు.. అద్భుతమైన కమెడియన్‌గా పాత్రలను అద్భుతంగా పోషించారు. అద్భుతమైన నటుడ్ని కోల్పోవడంతో మనసంతా చాలా బాధాకరంగా ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలోనూ కుజాలు చెంబులైపోతాయంటూ ఆయన అద్భుతమైన రోల్‌ చేశారు. పాత్ర నిడివి ఎంతని కాదు.. ఆయన తన నటనతో మనకు గుర్తుండిపోతారు. ప్రత్యేకమైన నటుడు. నన్ను ప్రసాదూ.. అని పిలిచేవాడు. ఆయన మనకు దూరం కావడం డీప్‌ షాక్‌గా ఉంది.      - రాజేంద్రప్రసాద్‌


బాధాకరమైన వార్తతో నిద్ర లేచాను. మీ ఆత్మకు శాంతి కలగాలి             - సుధీర్‌ బాబు


జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం తీరని లోటు, ఎంతో బాధాకరం. చనిపోతున్న మన నాటకరంగానికి ఎంతో సేవ చేశారు. అద్భుతమైన జ్ఞాపకాలను అందించారు. వ్యక్తిగా ఆయనెంతో గొప్పవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి 
                                                                                -  దేవా కట్టా

విలక్షణ నటుడు జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం ఎంతో బాధను కలిగించింది. నేను టీవీలో వర్క్‌ చేస్తున్నప్పుడు ఆయన్ని ఇమిటేట్‌ చేయడానికి ప్రయత్నించేదాన్ని. ఆయన ఆత్మకు శాంతి కలగాలి           - అనసూయ

జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం తెలుగు సినిమాకు తీరని లోటు               -  ప్రణీతా సుభాష్‌


జయప్రకాశ్‌ రెడ్డిగారి ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 

                                                                                - బండ్ల గణేశ్‌


ఈరోజు ఉదయం నిద్ర లేవగానే ఓ బాధాకరమైన విషయం తెలిసింది. నటుడు జయప్రకాశ్‌ రెడ్డిగారు మమ్మల్ని విడిచిపోయారని తెలిసి షాకయ్యాను. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను. సినిమాలనే కాదు.. వ్యక్తిగతంగానూ ఆయనతో మంచి అనుబంధం ఉంది. మంచి నటుడు, మంచి స్నేహశీలి. మానవతా విలువలున్న మనిషి. చిన్నపిల్లల మనస్తత్వమున్న వ్యక్తి. మనసులో ఏదీ దాచుకోరు. ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా చేసే నటుడాయన. నేను, అశోక్‌కుమార్‌గారు, సత్యప్రకాశ్‌గారు, జేపీగారు కలిసి జయంమనదేరా సినిమాకు కలిసి పనిచేసినప్పుడు ఏర్పడిన అనుబంధంతో ఆయన్ని డాడీ అని పిలిచేవాళ్లం. తెలుగు ఇండస్ట్రీ మంచి నటుడ్ని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నాను                                                      - బెనర్జీ


మా ప్రియమైన స్నేహితుడు జయప్రకాశ్‌ రెడ్డి సుదూరలోకాలకు వెళ్లారనే వార్తలో నిద్రలేవడం బాధాకరం. బ్రహ్మపుత్రుడు, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం..రా ఇలా నటుడిగా ప్రతి సినిమాతో మీరెంతో పేరు తెచ్చుకుని అందరి అభిమానానికి పాత్రలయ్యారు. మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నాం                      -  సురేష్‌ ప్రొడక్షన్స్‌


జయప్రకాశ్‌ రెడ్డిగారి ఆకస్మిక మరణ వార్త విని షాకయ్యాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం 

                                                                             - డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌


జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి    - మైత్రీ మూవీ మేకర్స్‌


విలక్షణ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం       - 14 రీల్స్‌ ప్లస్‌


గ్రేట్‌, టాలెంటెడ్‌ యాక్టర్‌ జయప్రకాశ్‌రెడ్డిగారి మరణం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి 

                                                                     - సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌





Updated Date - 2020-09-08T14:56:04+05:30 IST