కామ్రేడ్ రవన్న
ABN , First Publish Date - 2020-12-15T10:34:03+05:30 IST
అతని కథేంటి? కామ్రేడ్‌గా మారడానికి కారణాలేంటి? అన్నది తెలుసుకోవాలంటే ‘విరాటపర్వం’ చూడాల్సిందే’’ అంటున్నారు దర్శకుడు వేణు ఊడుగుల...

‘‘ఈ దేశం ముందు ఓ ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది..
సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.
డా.రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న..
అతని కథేంటి? కామ్రేడ్‌గా మారడానికి కారణాలేంటి? అన్నది తెలుసుకోవాలంటే ‘విరాటపర్వం’ చూడాల్సిందే’’ అంటున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. దయన దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. రివల్యూషన్ ఈజ్ ఆన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అన్నది ఉపశీర్షిక. డి. సురేశ్‌బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రమిది. సోమవారం రానా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌తోపాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మావోయిస్ట్ లుక్‌లో తుపాకీ చేతబట్టి నడుచుకుంటూ వస్తోన్న రానా, ఆయన కళ్లల్లో తీవ్రత కథను తెలియజేస్తుంది. ‘‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం?’’.. అని ఒక కామ్రేడ్ ప్రశ్నిేస్త, వెనకున్న వారంతా ‘‘దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం’’ అంటూ నినాదాలు చేశారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1990లలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రియమణి, ఈశ్వరీరావు, సాచి చంద్, నివేదా పేతురాజు, నందితా దాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
Read more