సాధారణ ప్రశ్నలు.. అసాధారణ సమాధానాలు..

ABN , First Publish Date - 2020-12-27T11:04:58+05:30 IST

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘5 డబ్ల్యూస్‌’. (ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). సాధారణ ప్రశ్నలు,

సాధారణ ప్రశ్నలు.. అసాధారణ సమాధానాలు..

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘5 డబ్ల్యూస్‌’. (ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు... అనేది ఉపశీర్షిక. ప్రణదీప్‌ ఠాకోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శీమతి యశోద ఠాకోర్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ  ‘‘ ఒక పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఇన్వెస్టిగేటివ్‌ మిస్టరీ డ్రామా ఇది. పాయల్‌ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారు. 

Updated Date - 2020-12-27T11:04:58+05:30 IST