కరోనాపై పాటేసుకున్న మరో స్టార్ కమెడియన్

ABN , First Publish Date - 2020-04-16T23:02:24+05:30 IST

కరోనాపై సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సాంగ్ ఎంతగా ప్రచారం పొందిందో తెలియంది కాదు. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున

కరోనాపై పాటేసుకున్న మరో స్టార్ కమెడియన్

కరోనాపై సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సాంగ్ ఎంతగా ప్రచారం పొందిందో తెలియంది కాదు. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా కనిపించి అందరికీ ఈ పాట రీచ్ అయ్యేలా చేశారు. స్వయంగా ప్రధాని మోదీ కూడా ఆ పాటను మెచ్చుకున్నారంటే ఎంతగా ఆ పాట జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ‘చేతులెత్తి మొక్కుతా.. ’నంటూ చౌరస్తా బ్యాండ్ వాళ్లు చేసిన పాట కూడా భీభత్సంగా జనాలని ఆకర్షించింది. ఇలా చాలా పాటలు కరోనాపై వచ్చాయి. వస్తున్నాయి. ఇక కామెడీ కింగ్ జానీ లివర్ కరోనాపై పాడిన పాట ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆయన దారిలోనే మరో స్టార్ కమెడియన్ కరోనాపై పాటేసుకున్నారు. ఇంతకీ ఆ స్టార్ కమెడియన్ ఎవరనుకుంటున్నారు?


తమిళ్ స్టార్ కమెడియన్ వడివేలు. ‘కరోనా’ను జయించుదాం అంటూ ఆయన పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతకు ముందు కూడా కరోనాపై ఓ వీడియో షేర్ చేసిన వడివేలు.. కంటతడి పెట్టుకుని మరీ ప్రజలను ఇంటి వద్దే ఉండమని వేడుకున్నారు. తాజాగా కరోనాపై పాటతో వచ్చి.. తన వంతు బాధ్యతను నిర్వర్తించారీ స్టార్ కమెడియన్.Updated Date - 2020-04-16T23:02:24+05:30 IST

Read more