పెళ్లి పీటలెక్కిన `రంగస్థలం` మహేష్!

ABN , First Publish Date - 2020-05-14T20:31:42+05:30 IST

వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకున్న చాలా మంది ఆశలపై కరోనా మహమ్మారి నీళ్లు చల్లింది.

పెళ్లి పీటలెక్కిన `రంగస్థలం` మహేష్!

వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకున్న చాలా మంది ఆశలపై కరోనా మహమ్మారి నీళ్లు చల్లింది. లాక్‌డౌన్ కారణంగా ఘనంగా పెళ్లి చేసుకునే వెసులుబాటు దొరక లేదు. అయినా త్వరలో మూఢం వస్తుండడం, ముహూర్తాలు లేకపోవడంతో చాలా మంది వివాహాలు చేసేసుకుంటున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ తక్కువ మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. 


టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈ రోజు (గురువారం) నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. `రంగస్థలం`, `మహానటి` వంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న నటుడు మహేష్ కూడా ఇదే తరహాలో ఈ రోజ ఉదయమే వివాహం చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన పావనితో మహేష్ వివాహం జరిగింది. తక్కువ మంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. 

Updated Date - 2020-05-14T20:31:42+05:30 IST