‘కలర్ ఫొటో’.. మొదటి పాట ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2020-08-25T23:30:13+05:30 IST
అమృత ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం

అమృత ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కలర్ ఫొటో’. ఈ సినిమాతో సందీప్ దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సుహాస్, చాందీని చౌదరి జంటగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైవా హర్ష మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అమృత ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి సూపర్ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు ‘కలర్ ఫొటో’ చిత్రానికి కథ కూడా అందించడం విశేషం. ఇటీవలే ‘కలర్ ఫొటో’ టీమ్ విడుదల చేసిన టీజర్‌కు ఆన్ లైన్‌తో పాటు వివిధ వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించిందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీ టీజర్‌కు యూట్యూబ్‌లో దాదాపుగా 3 మిలియన్లుకు పైగా ఆర్గానిక్ పద్ధతిలో వ్యూస్ వచ్చాయి. ఇక ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వివిధ మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌తో ట్రెండ్ అవుతున్నట్లుగా ‘కలర్ ఫొటో’ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘కలర్ ఫొటో’ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి మొదటి పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. తరగతి గదిలో అంటూ మొదలయ్యే ఈ పాటను ఆగస్ట్ 27న ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ అఫీషియల్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా విడుదల చేస్తున్నట్లుగా తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో చిత్ర బృందం ప్రకటించింది.
డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘యూట్యూబ్‌లో నేను పోస్ట్ చేసిన వీడియోలను లైక్ చేస్తూ, పాజిటివ్ కామెంట్స్ పెడుతూ నన్ను ఎంకరేజ్ చేసిన ఆడియెన్స్ ఇప్పుడు డైరెక్టర్‌గా నేను తీసిన తొలి సినిమా ‘కలర్ ఫొటో’ను కూడా ఆదిరిస్తారని ఆశిస్తున్నాను. డైరెక్టర్‌గా నా తొలి సినిమా అయినప్పటికీ నా స్నేహితుడు సుహాస్ హీరో కావడంతో నేను ఎలాంటి బెదురు, టెన్షన్ లేకుండా సినిమా తెరకెక్కించాను. అలానే సినిమా నిర్మాతలు సాయి రాజేశ్, బెన్నీ ముప్పానేని షూటింగ్ సమయంలో ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా కథను నిర్మాత సాయి రాజేశ్‌గారు అద్భుతంగా, చాలా ఎమోషనల్‌గా రెడీ చేశారు. స్టోరీలో ఉన్న మెయిన్ సోల్ ఎక్కడా మిస్ కాకుండా ఆడియెన్స్ ఆకట్టుకునే రీతిన ఈ సినిమా ఆద్యంతం ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మంచి ట్యూన్ ఇచ్చారు. ఆగస్ట్ 27న మా సినిమా ఆల్బమ్ నుంచి తరగతి గది అంటూ సాగిపోయే పాట ఆదిత్య మ్యూజిక్ అఫీషియల్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా విడుదల అవ్వబోతోంది..’’ అని అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ గంగాధర్ మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవిగారి అభిమానిగా సినిమాల్లోకి వచ్చాను. నన్ను కలర్ ఫొటో సినిమాలో భాగస్వామిగా చేర్చుకున్న నిర్మాత సాయి రాజేశ్‌గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా కచ్ఛితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను..’’ అని అన్నారు.
Read more